సీతాలు

 కారు మబ్బుని మల్లె వర్ణం తో కప్పిన వెండి వెన్నెల్లో 

పాల నురగళ పూత పూసిన ఇసుక తిన్నెలలో 

గాలి మాటున నిలయమైంది ఓ గుడిసె , గుడిసె లో సీతాలు !


వెండి మువ్వలు ఆటలాడే చిట్టి పాదాలు 

 కుచ్చిళ్ళు మోసి ఎరుపెక్కిన లేత నడుము, నడుము పై సేదతీరిన సన్నని నగ 

మెడలో కదలాడే పసుపు పచ్చని పుస్తెలు, చిక్కటి రంగు, చక్కని రూపం 

బరువెక్కిన ఎద, ఆశ దీరని కళలు, ఆవురగా గుమ్మంకేసి చూస్తుంది సీతాలు !


చల్లగాలి చీర పొర దాటి ఒళ్ళంతా తాకింది 

నిండు చంద్రుడు మైకం లో తేలియాడుతున్నాడు

గుప్పుమంది జడకెక్కిన మల్లెల మాల

అలుముకుంది గుడిసెలోన వెచ్చని తన శ్వాస 

పున్నమి తాపంలో సముద్రుడు ఎగసి పడుతుంటే,

పెనివిటి రాకకై వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది సీతాలు!

Comments

Popular posts from this blog

Can you hear me ?

Hey Candy Store!