Marapu
మరపు సంద్రం తీరం దాటుతుంటే, తీరం భారం పెంచుతుంటే , భారం క్షోభను వెంటతెస్తే, జాలి లేక జలం ఎగసి ఎగసిపడుతుంటే, ప్రళయమో విళయమో పోల్చలేని వేళలలో, తలచెనా మది నిను ఒక క్షణమైనా? మరిచెనా మన స్మృతులను మరు యుగమైనా? కెరటాలు చేరువవగా, కణకణము ఆవహించగా , కారుమబ్బు కళ్లుగప్పి కటిక చీకటి నాహ్వానించగా, సుడిగుండం లో సతమతమవగా, సాగరములో తనువు కలవగా, ఉచ్ఛ్వసించు క్షణముకై జగడమాడువేళలో, అస్తమించు శ్వాస కై జరిగే తుది పోరాటంలో, తలచెనా మది నిను ఒక క్షణమైనా? మరిచెనా మన స్మృతులను మరు యుగమైనా?