Marapu

 

మరపు

సంద్రం తీరం దాటుతుంటే,
తీరం భారం పెంచుతుంటే,
భారం క్షోభను వెంటతెస్తే,
జాలి లేక జలం ఎగసి ఎగసిపడుతుంటే,
ప్రళయమో విళయమో పోల్చలేని వేళలలో,
తలచెనా మది నిను ఒక క్షణమైనా?
మరిచెనా మన స్మృతులను మరు యుగమైనా?

 

కెరటాలు చేరువవగా, కణకణము ఆవహించగా,
కారుమబ్బు కళ్లుగప్పి కటిక చీకటి నాహ్వానించగా,
సుడిగుండం లో సతమతమవగా, సాగరములో తనువు కలవగా,
ఉచ్ఛ్వసించు క్షణముకై జగడమాడువేళలో,
అస్తమించు శ్వాస కై జరిగే తుది పోరాటంలో,
తలచెనా మది నిను ఒక క్షణమైనా?
మరిచెనా మన స్మృతులను మరు యుగమైనా?

Comments

Popular posts from this blog

సీతాలు

Can you hear me ?

Hey Candy Store!